10, ఫిబ్రవరి 2010, బుధవారం

నీ చిలిపితనముతో

కోయిలమ్మలా  వినిపించే
నీ తియ్యని మాటలు
నా ఎదలోతుల్లో చేరి
సరిగమలై ద్వనిస్తున్నాయ్.
వికసించే పువ్వులా  విరబూసే
నీ ఎర్రటి పెదాలపై చిరునవ్వు
చిలిపిచేష్టలు  చేస్తూ
నా మదిని అల్లరి పెడుతుంది...

ఒక రాత్రి..

వెన్నెల కాచే  సమయాన
వినీలాకాశంలో మెరిసే చంద్రబింబంలా
నీ రూపం కనిపిస్తుంటే
దానికి తోడు నా ఆశలకు రెక్కలొచ్చి
నక్షత్రాలుగా నిలుస్తున్నవి.......!!

అర్ధంకాని ప్రేమ

"ఎదలోతున దాగిన వింత ప్రేమ
                 సొగసుల గుబులేన్నెన్నో
వర్ణించడానికి అర్ధంకాని ప్రేమ
             అనే అక్షరాలలోని సుగునాలెన్నో
ఆలోచించే మనసుకి అంతా పాతే
కానీ..
ఆస్వాదించే మనసుకి అంతా కొత్తే కదా.....!!"

నీకై నేను

సాయంత్రం కన్నేర్రచేసింది
        నువ్వు జతగాలేవని
ఒడ్డును తడిమి అలలు వెనక్కిమల్లినవి 
          నీ పాద ముద్రలు తగలలేదని  
తీరం సాగరఘోషతో హోరెత్తింది
           నీ నవ్వులజడి కురువలేదని
గవ్వలన్ని మూతి ముడుచుకున్నవి
          నిన్నే గుర్తుకుటెస్టు
నువ్వులేని నన్ను చూసుకుంటే
ఏదో భయం.....శూన్యం...నిర్వేదం.........!!!!!

నీవెంత అందమో....

మల్లెలు విరిసినట్లుండే
                   నీ నవ్వులు
కోకిల కూసినట్లుండే
                    నీ మాటలు
వెన్నెల కాసినట్లుండే
                   నీ  కన్నులు
సెలయేరు సాగినట్టుండే
                  నీ నడకలు
కారుమేఘాల్లాంటి
                  నీ కురులు
మలయమారుతంలాంటి
                  నీ చూపులు
వసంతంలాంటి
                  నీ సోయగం
జలపాతంలాంటి
                 నీ రాజసం
అన్ని కలగలిపిన నీవై ముద్దొచ్చేలా
              ఎంత బాగుంటావో ...........!!!!!!!!


                 

నా మొదటి ప్రేమలేఖ

టైం: నచ్చేంతవరకు                                                                                                                         మార్క్స్: జీవితం
         డియర్...........
                                 ఇలా మొదలుపెట్టి..........................

                                                       "ప్రేమ అనే గొప్ప పదం
                                                        రెండు మనసుల గొప్పతనం"

        నువ్వంటే ప్రేమ, మమకారం, ఇష్టం అన్ని ఎక్కువే . నీపై మరువలేని జ్ఞాపకాలతో, చెరిగిపోని గుర్తులతో నా మనసు నిన్నే
        తలుస్తూ, రోజులన్నీ పిచ్చివాడిలా గడిపెస్తున్నాను.
                                 నువ్వు నాకు కనిపించే ప్రతిక్షణం జీవితంలో మిగిలిపోని మదురానుభూతిలా  వుంటుంది.
         అదే నీవు నా సొంతమైతే ప్రపంచాన్నే జయించినంత ఆనందం.నా మనసులోని మాట తెలిపిన నీ నోట ఏ మాట వస్తుందో అని
         భయంతో ముగిస్తూ.....
                                                ఇలా ముగించాను......

విరహ వేదన

నా గుండె పగిలేంత గట్టిగా
నీకు వినపడనంత నిశ్శబ్దంగా
నా మనసు నిన్ను పిలుస్తూ వుంది..
కానీ.......
నా పిలుపు నీ మనసుకు అర్దం కాదు(వినపడదు)కదా...?