4, జనవరి 2011, మంగళవారం

చెలీ నీవుంటే...

నీ కన్నుల కాంతిలో ఉదయాలు కన్పిస్తాయి.



నీ నవ్వుల సవ్వడిలో కోయిల రాగాలు వినిపిస్తాయి.

నీ సానిహిత్యంలో వసంతాలు దరికొస్తాయి.


నీ కోసం నిరీక్షణలో యుగాలు క్షణమవుతాయి.


నీ తలపుతోటి మనసుకు రెక్కలొస్తాయి.


నీ పిలుపుతోటి మది భావాలు వెలికొస్తాయి.


నీవుంటే నాకు విజయాలు వరిస్తాయి.


నీవంటూ లేకుంటే అపజయాలు వెక్కిరిస్తాయి...!!

ఎమిటిది నేస్తం... !

మంచు తెరల్లో ముత్యంలా కనిపిస్తావు


మనసు లోతుల్లో ముల్లువై గుచ్చేస్తావు

నా మనసు రాజ్యానికి రాణిలా అనిపిస్తావు

పరిపాలించ రమ్మంటే కాదని గెంటేస్తావు

ముద్దబంతి పువ్వులా ముద్దొస్తావు

ఓరకంట చూస్తేనే మందారంలా కొపగించుకుంటావు

మౌనంగా ఉందామంటే రాగమై వినిపిస్తావు

సందడి చేద్దామంటే సమయం లేదంటావు

వద్దనుకుందామంటే వలపులు పంచే దేవతలా కనిపిస్తావు

కోరి వద్దకు వస్తే కోపంగా చూచి పొమ్మంటావు

సాయం సంధ్యవేళ వీచే గాలి తెమ్మెరలా నా మది దోచేస్తావు

మనసు మౌనం కరిగేవేళ వడగాలివై ఉక్కిరిబిక్కిరి చేసేస్తావు..!!

నువ్వొస్తావు....!!

నువ్వొస్తావు....


మలయ సమీరంతో మంద్ర మంద్రంగా

హొయలు హొయలుగా

కోటి ఊసులను మోసుకొస్తూ...



నువ్వొస్తావు..



మండువేసవిలో పండువెన్నెలలా

వలపు పరిమళాలకు చిరు రాగాలను చేరుస్తూ

కోయిల కుహుకుహూలకు శ్రుతి సరిచేస్తూ

రతీ మన్మధంలాగా...



నువ్వొస్తావు



భావం, రాగం, తానం,పల్లవి

అన్ని తానైన ప్రణవనాదంలా

మంత్రజగత్తు సరిహద్దులను

సుతారంగా మీటుతూ

వెయ్యి వసంతాల చంద్రోదయంతో..



నువ్వొస్తావు



నువ్వూ నేనూ సంగమించే క్షణం...

నువ్వూ నేనూ ప్రణవించే క్షణం..

నువ్వూ నేనూ వూసులల్లుకునే క్షణం..



ఎదురుచూస్తూ నేను..

జాటాజూటధారి వదిలే గంగా ఝరిలా నువ్వు..



నువ్వొస్తావు...

అమరనాదాలను మోసుకొస్తూ..

నువ్వొస్తావు.. నువ్వొస్తావు.. !!

నువ్వు వస్తావని...

నిశీధిని తరిమేసేందుకు మినుకుమంటూ ప్రయత్నించే మిణుగురులా...


ఆశ చావని నా ప్రాణం నీ కోసం ఎదురు చూస్తూ ఉంటుంది.

ఎవరెన్ని చెప్పినా వినని మూర్ఖుడిలా...

నా మనసు నీకోసమే తపిస్తూ ఉంటుంది.

భూమి ఆకాశాలు ఒకటైనా సాగరాలన్నీ ఏకమైనా...

నిను వలచిన నా హృదయం నీకోసమే వేచి ఉంటుంది....

ఎవరు చెలీ నీవు... ?

ఎవరులేని ఒంటరి పయనంలో...


బంధాలే లేని నిర్మానుష్య లోకంలో...

నాకోసం వచ్చావు..........

మమతంటే ఎరగని మనసులో...

ప్రేమంటే తెలియని హృదయంలో...

చిరునామా అయ్యావు.......

నిరాశ నిండిన మస్తిష్కంలో...

రంగులు ప్రపంచం ఎరగని నా కనుపాపల్లో...

కాంతి నింపే వెలుగయ్యావు........

సంతోషమెరగని జీవితంలో...

నాకోసం ఎవరూ లేని ప్రపంచంలో...

నీకోసం (నే)ఉన్నానంటూ అన్నీ నీవైనావు....

11, అక్టోబర్ 2010, సోమవారం

ఎలా...???????

నీవెనకే నడిచొచ్చాకే మొదలయ్యింది కథ..


నాకన్నా నిను ప్రేమించానే ఏమౌతుందో కదా...



ఆలోచనల అంతంతీరం నీ మనసే కదా

ఆవేశంగా మలిచేస్తున్నా అక్షరాలనే ఇలా...

దూరంగా నిలబడినా నీడగ ఉన్నా కదా..

ప్రాణంతో పిలిచేమాట నీ మనసుకి వినపడేది ఎలా...

ఏమైందో..ఏమౌతుందో పిచ్చిగ ఉందే తలా..

ఏమైనా నీ మనసుని దోచేమార్గం ఇక తెలపవే ఎలా...???????

                 ............సంతోష్...............

8, అక్టోబర్ 2010, శుక్రవారం

నీ తోడుకోసం

నువు దూరంగా ననువీడి వెళ్లి


నీ తనకి దగ్గరయ్యావా..తన తనువుకి చేరువగా


ఎందుకు నేను నీకు అంతలా బారమయ్యానా


నీకు ఎదురైనా పలకరించనంతగా,నీ ఎదలో మోయనంతగా......






నిరాశా నిస్పృహలు నను వెంటాడి వేదిస్తుంటే


తనొస్తుంది(నీవు) అనే అభయాన్ని వాటికి భయంగా చూపించా...


కానీ....


నువు రాక,నను చేరక


నీకు నీవుగా,నీలో నీవుగా


మరొకరి తోడుగా,నీడగా నీవే సర్వస్వమైనప్పుడు






నాకు..


మరల మరలా అవే అలోచనలతో,అంతులేని ఆశలతో


ఈ ఆశాదృక్పదంతో నాకు నేనై,నాలో నేనై


నా సొంతానికి నేను మాత్రమే సొంతమై


నీ తోడుకోసం ఎదురుచూసా...






నీవు మాత్రం......


కలతచెందని నయనాన్నీ,గాయపడని మనసుని


నా ముందు పరిచి...నన్ను మరింతలా గాయపరిచావు....






..........SaNtHoSh.........