21, సెప్టెంబర్ 2010, మంగళవారం

నీకై తలచి

అక్షరాల పూమాలలో నీ పేరు సుగంధం విరజిల్లుతుంటే



ఆ సువాసనా పరిమళాలు నా సుతిమెత్తని ఎదని పరవశింపచేసే క్షణాన...


నాలో నేను లేను...నిలువెత్తు నీ రూపంలో నిలిచిపోయా.


నన్ను నేను మరచిపోయి...నీకై తలచి తలచి..!!

4, జూన్ 2010, శుక్రవారం

నీవెవరో...ఇప్పుడెక్కడో..!!




అనుకోకుండా అతిదినయ్యానా నీ కనులకు...........

మనమధ్య పరిచయమేలేదు..
పలకరించుకునేంత చనువూలేదు..
అయినా.....
నీ చూపు బాణం నాపై ఎందుకు విసిరావు..
నా కనులలోకి చూస్తూ..
ఎదసవ్వడిని పెంచేస్తూ..
నిన్ను చూడగానే నాలో మొదటిసారి కలిగింది ఈ పులకరింత
నీతో చెప్పుకోలేక దాచుకున్నాను..భావాన్నంత..
నిన్నునేను అభిమానిస్తున్నానా లేక ప్రేమిస్తున్నానా..?
అభిమానమైతే ఎందరిని చూసినా కలగని ఈ వింత
నిన్నుచూడగానే మొదలు ఈ గిలిగింతా..ఎందుకో..
నీకు తెలుపలేని పదాలను
నా పెదాలు కట్టిపడేస్తుంటే...
అదేంటో మరి..
నా కంటిచూపులే భావాలై
నీకు తెలియజేస్తున్నాయా..
లేక మైమరపించి నన్నే కలవర పెడుతున్నాయా...
 బాదనంతా లోలోనే దాచేస్తూ మనము గడిపింది కొంత సమయమే అయినా
ఎప్పుడూ అనుభవించని కొత్త వింత అనుభూతి కంటి చూపులతోనే తెలుపుకున్నామా..?
వెళ్తూ...వెళ్తూ...నన్నెందుకు చూసావూ
ఎందుకు వదిలేసి వెళ్తున్నావూ..అంటే..
చివరకు మౌనమే సమాదానమై...
వేదనే మిగిల్చినదని తెలుపనా.........అదే మౌనంతో..!!

మీ సంతోష్....

5, ఏప్రిల్ 2010, సోమవారం

నీ జ్ఞాపకాల పందిరిలో ఇలా..................

నీ జ్ఞాపకాల గుర్తులన్నీ నా మదిలో నింపుకొని

నిన్ను చేరడంకోసమై పయనిస్తున్నా దారి తెలియని బాటసారిలా..
ఎలా వర్ణించను,ఏ భావంతో తెలుపగలను
నీపై నాకున్న ప్రేమని...
కానీ ప్రేమించగలను...ఎంతలా అంటే
ప్రేమను ప్రేమగా ప్రేమతో ప్రేమించగలను....
నిర్లిప్తమైన ఆలోచనలతో,నీకై నిరీక్షీంచిన కనులతో
ఆర్తిగా అడుగేస్తున్నాను....
నడుస్తున్నాకొద్దీ దగ్గరవుతున్నావేమో అని
చేయి చాచి అడుగుతున్నా....
నన్ను నీవుగా స్వీకరించమని
నీలోనే సగాభాగమై ఉండిపోనిమ్మని...
దగ్గరైనట్టు అనిపించేది నా మనసుకే కానీ
నా చేతికి కాదు...
నీవు నాకు అందనంత దూరం,అందుకోలేనంతగా
అందుకున్దామన్నా అందనంతగా
దూ............................రమయ్యావు...

                  నా మదికి గాయం చేసి
                  నన్ను ఒంటరిని చేసి........!!!!!!!!!

1, ఏప్రిల్ 2010, గురువారం

I Miss U....

ఆలోచిస్తే అన్నీ నీ జ్ఞాపకాలే
               వాటితోనే నా వ్యాపకం
ఏమనుకోవాలి నన్ను నేను
               తిట్టుకున్నా అర్ధం లేదు
కనురెప్ప మూసి తెరిచేలోగా
               నా ముందున్నట్టే అనిపిస్తావు
కానీ నీవు......
నా చేతికి అందనంతదూరం
              కాదు నాకు కనపడనంతదూరం
నా జీవితంలో నాకు చేరువకానంత దూరం..............
నీవు నన్ను విడిచి వెళ్ళావని ఎలా తెలుపను
                     నిన్నెలా అర్ధం చేసుకోను.................

నీ జ్ఞాపకాలతోనే గడిపేస్తూ నిలువెత్తు శిలగా నిలిచిపోనా...

16, ఫిబ్రవరి 2010, మంగళవారం

తీరం తెలియని గమ్యం

ప్రేమకై.......
నా ఎదలోతులో మిగిలిన తాపం
ఎవరిని ఎదురించలేనంత కోపం
ప్రేమించే సమయం ఈ ఉదయం అంటే
ఏమో చెప్పలేను అంది నా హృదయం
నా గుండెలో చేరపలేను నీ రూపము
అలాగని ప్రేమ తెలుపలేదు నా మౌనం
ఎగసిపడే కెరటంలా నీపై ప్రేమ
మనసులో ఉవ్వెత్తున ఎగసి పడుతుంది
ఏమి చెయ్యాలని ఆలోచిస్తూ
దారి తెలియని బాటసారిలా సాగే
జీవిత ప్రయాణంలో......
నీవు నన్ను ఇష్టపడే  రోజున
నీ ప్రేమ ముంగిట్లోనే సేద తీరుతుంటే
నీ మనసులోని మధురమైన మాటలు
నా మనసుతో (నీ మనిషితో) చెపుతూవుంటే
నీ గుండె సవ్వడినై ఇలాగే ఉండిపోవాలని ..................!!!!!








11, ఫిబ్రవరి 2010, గురువారం

నీవున్నావనే ఊహలో.!


నీవు నన్ను చూసే నీ కంటిచూపే వర్షపుచినుకైతే
నా మనసు ఆ వర్షంలో తడసి ప్రేమ పువ్వై వికసించదా 
నీ నవ్వు సరిగమ రాగాలుగా ద్వానిస్తుంటే 
దానిని అనుసరిస్తూనే ప్రేమగీతం పాడుకోనా 
నీ మాటలన్నీ కలిసి ముత్యాల్లా రాలుతుంటే 
వాటిని ఏర్చి కూర్చి హారంగా చేసి 
నీ మేడలో నా ప్రేమ గుర్తుగా వెయ్యనా 
నీ అడుగులో అడుగు కలిపి 
జీవితాంతం నీతో కలిసి
నీ నీడగా, తోడుగా 
నీకై కాలక్షేపం  చేస్తూ 
నీ ప్రేమకై ఎదురు చూస్తూ వేచివుంటా............!
నీవున్నావనే ఊహలో.!
        



10, ఫిబ్రవరి 2010, బుధవారం

నీ చిలిపితనముతో

కోయిలమ్మలా  వినిపించే
నీ తియ్యని మాటలు
నా ఎదలోతుల్లో చేరి
సరిగమలై ద్వనిస్తున్నాయ్.
వికసించే పువ్వులా  విరబూసే
నీ ఎర్రటి పెదాలపై చిరునవ్వు
చిలిపిచేష్టలు  చేస్తూ
నా మదిని అల్లరి పెడుతుంది...